04:40 AM, 3 Wednesday March 2021

ఓటు అనే ఆయుధం ద్వారా ప్రజాస్వామ్య విలువలను రక్షించుకోవాలి: కంచుమర్తి బాబురావు

రామచంద్రపురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు కంచుమర్తి బాబురావు ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.రామచంద్రపురం మెయిన్ రోడ్ లో ర్యాలీగా బయలుదేరి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని సుమారు 100 మంది రోగులకు ఏరియా సూపరిండెంట్ డాక్టర్.ప్రవీణ్ చేతుల మీదుగా రోగులకు పౌష్టికాహారం అందించారు.ఈ సందర్భంగా కంచుమర్తి మాట్లాడుతూ మానవ హక్కులను పరిరక్షించడంలో ప్రపంచంలోనే ముందు వరుసలో వుండే వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ప్రజాస్వామ్య విలువలను రక్షించడం కోసం ఓటు అనే ఒక ఆయుధాన్ని ఇచ్చారన్నారు.జాతి, మత,రాజకీయ,వ్యక్తిగత కారణాలతో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండ ప్రతి ఒక్కరూ ఏ విధమైన వివక్ష లేకుండా ప్రశాంతంగా జీవించాలన్నారు.ఈ కార్యక్రమంలో రామచంద్రపురం బార్ కౌన్సిల్ అధ్యక్షులు దొమ్మలపాటి సత్యనారాయణ,సీనియర్ అడ్వకేట్ ఉండవల్లి గోపాల్,ఉండమట్ల శ్రీనివాస్,సిపిఐ సిపిఎం నాయకులు గెద్దాడ రాము,శారదా దేవి,ప్రజానాట్య మండలి సభ్యులు మందపల్లి ప్రేమానందం బ్రహ్మానందం,ఈశ్వరరావు,బిజెపి సభ్యులు హరిబాబు,బుల్లబ్బాయి,పలివెల రాజు,మాజీ కౌన్సిలర్లు పెంటపాటి శ్రీనివాస్, పసుపులేటి సత్తిబాబు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#