11:57 PM, 3 Wednesday March 2021

పేద ప్రజల అభ్యున్నతికి కృషి..

◘ పర్యాటక రంగానికి ప్రాధాన్యత…
◘ జిల్లా టూరిజం అభివృద్ధి కి చర్యలు…
◘ పర్యాటక మంత్రి శ్రీనివాస్…

మండపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

పేద ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ  మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాస్(అవంతి శ్రీనివాస్) పేర్కొన్నారు. మండపేట మండలం ద్వారపూడి లోని శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయంలో ఇరుముడులు సమర్పించిన అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడారు. మండపేట నియోజకవర్గ వైస్సార్ సిపి కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఆంధ్ర శబరిమల ద్వారపూడి అయ్యప్ప స్వామి వారిని కార్తీకమాసంలో ఎంతో మంది భక్తులు  దర్శించుకునేవారన్నారు. కరోనా ప్రభావంతో ఆలయానికి  భక్తుల తాకిడి తగ్గిందన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై  ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తద్వారా  పేద ప్రజల అభ్యున్నతికి  అవకాశాలు  మెరుగుపడాలని  ఆయన ఆకాంక్షించారు. పేద ప్రజల  సంక్షేమానికి  అభివృద్ధికి  రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను  ప్రవేశపెట్టిందన్నారు.  గ్రామ ,వార్డు సచివాలయం వ్యవస్థ  ద్వారా  క్షేత్రస్థాయి పరిపాలనకు  శ్రీకారం చుట్టరన్నారు. గ్రామస్థాయిలో  సుపరిపాలన అందిస్తున్న ఘనత తమదేనన్నారు.  ఇంటి ముంగిట ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ కు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయన్నారు.

అద్భుతమైన ఆలయం…

తూర్పుగోదావరి జిల్లాలోని అందాలు ప్రకృతి వర ప్రసాదాలని పేర్కొన్నారు.
కేరళలో ఉన్న అయ్యప్పస్వామి ఆలయం మాదిరి ఆంధ్ర శబరిమల ద్వార పూడి అయ్యప్పస్వామి ఆలయం అద్భుతంగా ఉందన్నారు. జిల్లాలో టూరిజం అభివృద్ధి కి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక రంగం అభివృద్ధి కి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం ద్వార పూడి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ దంపతులను ఘనంగా సత్కరించి జ్ఞాపిక లను అందజేశారు

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#