రహదారి సమస్య తీరే వరకు ఎన్నికల బహిష్కరణ.. తుమ్మలపల్లిలంకలో గ్రామస్తుల నిరసన

Kajuluru, Kakinada (VISWAM VOICE DESK): కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆర్యావటం గ్రామ శివారు తుమ్మలపల్లిలంకలో రహదారి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ గ్రామానికి ప్రధాన రహదారిని పునర్నిర్మించి, రాకపోకలకు అనువుగా మార్చే వరకు ఎటువంటి ఎన్నికల్లోనూ పాల్గొనబోమని స్పష్టం చేశారు. ఆదివారం గ్రామ ముఖద్వారం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. గత 15 నెలలుగా రహదారి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం కావడం లేదని...