04:01 AM, 3 Wednesday March 2021

భీమేశ్వర ఆటో యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక

రామచంద్రపురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ద్రాక్షారామంలో భీమేశ్వర ఆటో యూనియన్ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఈ నూతన కార్యవర్గ ఎన్నిక ద్రాక్షారామం ఆటో యూనియన్ల గౌరవ అధ్యక్షులు రాష్ట్ర వైఎస్ఆర్సిపి న్యాయ విభాగ కార్యదర్శి మాగాపు అమ్మి రాజు ఆధ్వర్యంలో జరిగింది. ఆటో యూనియన్ అధ్యక్షులుగా మలకా రాజు, ఉపాధ్యక్షులుగా అనుసూరి సత్యనారాయణ, కార్యదర్శిగా కే.సత్యనారాయణ, ట్రెజరర్ గా కోట వెంకటేశ్వరరావు, భీమశంకరం ఎన్నికోబడ్డారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు మాగాపు అమ్మిరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఆటో కార్మికులను పట్టించుకున్న పరిస్థితులు లేవని, ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆటో వాలాకు ప్రతి ఏటా పది వేల రూపాయల చొప్పున అందజేస్తున్నారని దీనివల్ల ప్రతి ఆటో కార్మికునికి కొంతమేర లబ్ధి చేకూరుతుందని వ్యాఖ్యానించారు. ఎన్నిక కాబడిన కార్యవర్గం యూనియన్ అభివృద్ధికి కృషి చేసి మరింత అభివృద్ధి చెందాలని యూనియన్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు మాగాపు అమ్మి రాజు ను ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు గతంలో చేసిన సేవలకు గుర్తింపుగా దుశ్శాలువతో సత్కరించారు.ద్రాక్షారామం ఆటో యూనియన్ల నాయకులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#