పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత: రామచంద్రపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన ర్యాలీ

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక రామచంద్రపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో "పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత" అనే అంశంపై అవగాహన ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ కే. చిట్టిబాబు అధ్యక్షత వహించి మాట్లాడారు. మన రాష్ట్రాన్ని స్వచ్ఛందంగా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర, సాస సమన్వయకర్త శ్రీ ఆర్.ఎన్. రఘురాం,...