కొత్త ఎక్సైజ్ పాలసీపై కసరత్తు.

మంగళగిరి, NTR (VISWAM VOICE DESK): రాష్ట్రంలో  ప్రస్తుత ఎక్సైజ్ పాలసీ గడువు సెప్టెంబర్ 30తో ముగియనున్న నేపథ్యంలో, తదుపరి రిటైల్ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనపై మంత్రుల బృందం గురువారం మంగళగిరిలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో సమావేశమై విస్తృతంగా చర్చించింది. గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆన్‌లైన్...