VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 11:56 am Posted by : shaikansar.ali37@gmail.com

తుఫాను ప్రభావిత వార్డుల్లో పడిపోయిన చెట్లను వెంటనే తొలగించాలి….డాక్టర్ రాము

Mandapeta, East Godavari (VISWAM VOICE DESK):

అధికారులకు,వార్డు అభ్యర్థులకు వైసిపి చైర్మన్ అభ్యర్థి డాక్టర్ రాము విజ్ఞప్తి…

 

మండపేట పట్టణ పరిధిలో అర్నాబ్ తుఫాను ప్రభావంతో పలు వార్డుల్లో రోడ్లపై, విద్యుత్‌ లైన్లపై పడిపోయిన చెట్లను వెంటనే తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి డాక్టర్‌ రాము, వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థులను,అధికారులను

కోరారు.పడిపోయిన చెట్ల కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు కూడా ఆటంకం ఏర్పడిందని వారు పేర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.తుఫాను తీరం దాటినప్పటికీ భారీ వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్‌ రాము సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, పిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.