02:18 AM, 25 Thursday February 2021

రోడ్లు, రైలుపట్టాలపై బైఠాయించిన రైతులు…నిలిచిన ట్రాఫిక్

న్యూఢిల్లీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల పిలుపుమేర మంగళవారం భారత్ బంద్ విజయవంతం అయింది. రైతుల బంద్ కు వివిధ కార్మిక సంఘాలు విపక్షాలు మద్ధతు ప్రకటించడంతో బంద్ సంపూర్ణంగా జరిగింది. రైతులు రోడ్లు, రైలుపట్టాలపై బైఠాయించడంతో వాహనాలు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాగరాజ్ నగరంలో సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు రైళ్లను అడ్డుకున్నారు. జైపూర్ నగరంలో రైతులు, ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం వద్ద ఘెరావ్ చేశారు

బంద్ సందర్భంగా ఎవరైనా 3 గంటలపాటు ఇరుక్కుపోతే వారికి మంచినీరు, పండ్లను ఇస్తామని, తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని రైతు సంఘం నాయకుడు రాకేశ్ తికాయత్ చెప్పారు. బనారస్ నుంచి గ్వాలియర్ వెళ్లాల్సిన బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రయాగరాజ్ నగరంలో కార్యకర్తలు ఆపివేశారు. భారత్ బంద్ సందర్భంగా భువనేశ్వర్ రైల్వే స్టేషనులో రైళ్లను రైతులు నిలిపివేశారు. రవాణ సంఘాలు బంద్ కు మద్ధతు ప్రకటించడంతో సరుకుల రవాణాపై తీవ్ర ప్రభావం చూపించింది. పూణే మార్కెటును తెరిచినా రైతుల బంద్ కు తాము మద్ధతు ఇస్తున్నామని వ్యాపారులు చెప్పారు

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#