VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 1:21 pm Posted by : BOMMU DURGARAO

యర్రపోతవరం వంతెన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు దుర్మరణం

Yarapothavaram (K. GANGAVARAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం యర్రపోతవరం వంతెన వద్ద గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తూ జారిపడిన ఓ వృద్ధుడు బస్సు వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. అద్దంపల్లి గ్రామానికి చెందిన వాసా సత్యనారాయణ (70) రాజమహేంద్రవరంలో నివసిస్తున్న తన చిన్న కుమారుడి వద్దకు వెళ్లేందుకు రామచంద్రపురం వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ అదుపుతప్పి కింద పడిపోవడంతో బస్సు వెనుక చక్రం ఆయనపై నుంచి వెళ్లింది. దీంతో తీవ్ర గాయాలై సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ప్రమాదంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పామర్రు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వృద్ధుడి మృతితో అద్దంపల్లి గ్రామంలో విషాదం నెలకొంది.