యర్రపోతవరం వంతెన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు దుర్మరణం
Yarapothavaram (K. GANGAVARAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం యర్రపోతవరం వంతెన వద్ద గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తూ జారిపడిన ఓ వృద్ధుడు బస్సు వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. అద్దంపల్లి గ్రామానికి చెందిన వాసా సత్యనారాయణ (70) రాజమహేంద్రవరంలో నివసిస్తున్న తన చిన్న కుమారుడి వద్దకు వెళ్లేందుకు రామచంద్రపురం వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు...