12:19 AM, 2 Tuesday March 2021

హక్కుల కోసం పోరాడాలి

అమలాపురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

క్రైస్తవులు హక్కుల కోసం పోరాడాలని ఏపీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బిషప్ జల్లి జార్జి పాపప్ అన్నారు. అమలాపురం డివిజన్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మంగళవారం దివంగత బొంతు ధన రాజ్ ఆలయ ప్రాంగణంలో ఘనంగా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ గత అనేక సంవత్సరములుగా దేవునికి లోబడి అనేక శ్రమలు, ఇబ్బందులకు ఓర్చి ఆత్మల కొరకు భారము కలిగి ఘనమైన సేవ జరిగిస్తున పాస్టర్లు అందరకు సహకారముగా ఉండి పాస్టర్స్ అందరకు సహకారంతో అభివృద్ధి చేసే ఉద్దేశ్యంతో ఆవిర్భవించిన బడినది ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ రెవ డాక్టర్ ఎన్ యం సుగుణ రాజ్ , స్టేట్ లీడర్ రెవ బి ఎబినేజర్, స్టేట్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవ డాక్టర్ ఇమ్మానియేల్ రాజ్ , బ్రదర్ సన్ని బాబు, డాక్టర్ వి రాజ్ కుమార్, డాక్టర్ బొంతు రాజేష్ , యూ సి పి ఎ అధ్యక్షుల ఎల్ జోసఫ్, రెవరెండ్ ఇమ్మానియేల్, బిషప్ మోహన్ కుమార్, పాస్టర్ బీర దావీదు రాజు, పాస్టర్ పొదలడ ప్రభు రాజేష్ కుమార్, రెవ డా జె విక్టర్ కుమార్ కోనసీమ లో ఉన్నది 16 మండలాల దైవ సేవకులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#