VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 8:12 pm Posted by : VISWAM VOICE DAILY

మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్‌కు శ్రీకారం-దగ్గుపాటి.

100 కోట్లతో అత్యాధునిక పైలట్ శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన.

కోరుకొండ జూన్ 11(విశ్వం వాయిస్ న్యూస్) యువతకు ప్రపంచ స్థాయి విమానయాన శిక్షణతో ఉపాధి అవకాశాలు విరివిగా ఏర్పడినట్లు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. గురువారం మధురపూడిలో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో 100 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌టీఓ) ఏర్పాటుకు ఆమె శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొదటిసారిగా ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్‌గా ఇది నిలుస్తుందన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ దేశ విమానయాన రంగ అభివృద్ధిలో ఇది ఒక కీలక ముందడు గన్నారు. సుమారు ఆరు నెలల్లో ఈ శిక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావా లని లక్ష్యంగా పెట్టుకున్నామని, తొలి దశలో సుమారు 30మంది శిక్షణ అందించ నున్నట్లు తెలిపారు. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా,గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం వాటి సంఖ్యను 166కు పెంచిందన్నారు. ఉడాన్ పథకం ద్వారా విమాన ప్రయాణాన్ని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.గతంలో దేశంలో ఆరు విమానయాన సంస్థలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య తొమ్మిదికి చేరిందన్నారు. విమానాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నైపుణ్యం కలిగిన పైలట్ల అవసరం గణనీయంగా పెరిగిందన్నారు. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ పైలట్ ట్రైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా దశల వారీగా సుమారు 500 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించబడతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన శిక్షణ రంగానికి ఇది కొత్త దిశానిర్దేశం చేస్తుందని,రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి అవకాశాలు వస్తాయ న్నారు. దేశంలో విమానయాన రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం డీజీసీఏ అనుమతితో దేశవ్యాప్తంగా 35 ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లు మాత్రమే పనిచేస్తుండగా, అవి సంవత్సరానికి సుమారు 1,100 మంది పైలట్లకు మాత్రమే శిక్షణ అందిస్తున్నాయనన్నారు. దేశీయ విమానయాన సంస్థలు వేలాది కొత్త విమానాలను కొనుగోలు చేస్తున్న తరుణంలో రానున్న సంవత్సరాల్లో 25 వేల నుంచి 30 వేల మంది కొత్త పైలట్ల అవసరం ఉందని, ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌లోనే తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్‌ను మధురపూడిలో ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణ మన్నారు. జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో 100 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక శిక్షణా మౌలిక వసతులు, డైమండ్ డీఏ-40, డీఏ-42 శిక్షణ విమానాలతో కూడిన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది కనీసం 100 మంది పైలట్లను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేయ నుందన్నారు.సెప్టెంబర్ తొలి వారంలో శిక్షణ విమానాలు చేరుకున్న అనంతరం డీజీసీఏ అనుమతులు పూర్తిచేసుకుని పూర్తి స్థాయి శిక్షణ కార్యకలాపాలు ప్రారంభి స్తుందన్నారు. జార్విస్ ఏవియేషన్ అకాడమీ చైర్మన్ ఫణీంద్ర మాట్లాడుతూ రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయం ఫ్లైట్ ట్రైనింగ్‌కు అత్యంత అనువైన ప్రదేశమని తెలిపారు. విమాన యాన రంగ నిపుణులు,పరిశ్రమకు చెందిన ప్రముఖుల ఆధ్వర్యంలో జార్విస్ ఏవియేషన్ అకాడమీ స్థాపించబడింద న్నారు. దేశంలో ప్రస్తుతం శిక్షణ పొందిన పైలట్ల కొరత తీవ్రంగా ఉందని, ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి సంస్థలుసుమారు 2,000 కొత్త విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయని పేర్కొన్నారు. పరిశ్రమ అంచనాల ప్రకారం రానున్న దశాబ్దంలో 25వేల నుంచి 30వేల మంది కొత్త పైలట్ల అవసరం ఏర్పడనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జార్విస్ ఏవియేషన్ అకాడమీ చైర్మన్ ఫణీంద్ర,ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,ఆదిరెడ్డి వాసు,బత్తుల బల రామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ నామాన రాంబాబు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ డైరెక్టర్ కె. ప్రీత, నామాన శ్రీనివాస్, ఏపీ ఆర్ చౌదరి, మద్దిపాటి రజిని,మేడిశెట్టి శివరాం, అడపా శ్రీనివాస్,బదిరెడ్డి దొర, యర్రంశెట్టి పోలారావు, ముక్క రాంబాబు, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.