మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్‌కు శ్రీకారం-దగ్గుపాటి.
-100 కోట్లతో అత్యాధునిక పైలట్ శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన. కోరుకొండ జూన్ 11(విశ్వం వాయిస్ న్యూస్) యువతకు ప్రపంచ స్థాయి విమానయాన శిక్షణతో ఉపాధి అవకాశాలు విరివిగా ఏర్పడినట్లు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. గురువారం మధురపూడిలో జార్విస్ ఏవియేషన్ అకాడమీ ఆధ్వర్యంలో 100 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌టీఓ) ఏర్పాటుకు ఆమె శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొదటిసారిగా ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్‌గా ఇది నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ దేశ విమానయాన...