VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 9:10 pm Posted by : BOMMU DURGARAO

.ద్రాక్షారామలో ఉచిత వైద్య శిబిరం.. గ్రామ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలం ద్రాక్షారామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో తోటపేటలో ‘ప్రధాని 25 ఏళ్లు సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి సలహాలు, మందులు అందించారు.

ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు కర్రి చిట్టిబాబు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి, సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా కన్వీనర్ శ్రీ నాగిరెడ్డి సతీష్ రావు, మండల బీజేపీ అధ్యక్షులు ఆకేటి శ్రీకృష్ణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు, వికసిత్ భారత్ జిల్లా కన్వీనర్ గానాల కల్యాణ్, ప్రధాన కార్యదర్శి, మండల సేవా సంకల్ప అభియాన్ కన్వీనర్ తోలేటి సూర్య గంగాధర్ తదితరులు సందర్శించారు. అక్కడ అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకుని, సేవలందిస్తున్న డాక్టర్ రత్నసుధను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా సతీష్ రావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించడం ద్వారా అనారోగ్యాలను నివారించవచ్చని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సదుపాయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ వైద్య శిబిరంలో ఎంఎల్‌హెచ్‌బీ రేవతి, ఏఎన్‌ఎం సుబ్బలక్ష్మి, హెల్త్ విజిటర్ వరలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ శ్రీనుతో పాటు వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు