VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 7:11 pm Posted by : Chandu

రాయవరం ఎంపీడీవో కార్యాలయంలో రేపు ఉచిత వైద్య శిబిరం

రాయవరం,విశ్వంవాయిస్ న్యూస్:

రాయవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటన ద్వారా తెలిపారు. ఈ వైద్య శిబిరంలో రాజమహేంద్రవరానికి చెందిన గౌతమీ నేత్రాలయం, నీరజ డయాబెటీస్ ఆసుపత్రి, శ్రీ రమా దంత వైద్యశాలలకు చెందిన నిపుణులైన వైద్యులు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో రక్తపోటు (బీపీ), రక్తంలో చక్కెర (షుగర్) పరీక్షలు, కంటి పరీక్షలు, దంత పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, అర్హులైన కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. అలాగే, ఆరోగ్య కార్డు (ఈహెచ్‌ఎస్) కలిగిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఈహెచ్‌ఎస్ పథకం ద్వారా అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.