రాయవరం, East Godavari (VISWAM VOICE DESK):
స్వాతంత్ర్యమా నువ్వెక్కడ?
స్త్రీలకు రక్షణ లేని ఈ దేశంలో
మూగబోయావు
కులమతాల కుమ్ములాటలో
సాక్షివయ్యావు
కుర్చీ కోసం రాజకీయ నాయకులు వేసే ఎత్తుగడలు చూసి నిర్గాంత పోయావు
తల్లిదండ్రులు భారమని భావించి
వదిలి వెళ్ళిన కూతుళ్లను.. కుమారులను చూసి
బోరున విలపించావు
సాంప్రదాయాలు పక్కనపెట్టి ఆధునిక ముసుగులో యువత చేస్తున్న విన్యాసాలు చూసి కన్నీరు కార్చావు
ప్రజాసేవ చేయాల్సిన పాలకులు ప్రజలను శాసిస్తుంటే నవభారతం ఇదేనని సరిపెట్టుకుంటున్నావు
అందుకే….
స్వాతంత్ర్యమా నువ్వెక్కడ…?
ఖండవిల్లి భరత్ కుమార్
అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
వెంటూరు గ్రామం… రాయవరం మండలం..
తూర్పుగోదావరి జిల్లా…