17 November 2025
Monday, November 17, 2025

ఘనంగా శ్రీ మహాగణపతి సుబ్రహ్మణ్యేశ్వర సహేత శ్రీ బసవేశ్వర సంబరం…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

బసవేశ్వర స్వామి సేవలో పట్టణ ప్రముఖులు…

 

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట

మండపేట పట్టణం రావి చెట్టు సెంటర్ వద్ద మున్సిపల్ లైబ్రరీ వెనుక గల తమ్మవారి వీధి లో ఘనంగా శ్రీ మహాగణపతి సుబ్రహ్మణ్యేశ్వర సహేత శ్రీ బసవేశ్వర సంబరం జరిగింది. బసవేశ్వర స్వామికి సులలతో సంబరం చేయించారు. బ్రహ్మాండమైన బాణసంచా కాల్పులతో, కళ్ళు మీరిమెట్లు గొలిపే లైటింగ్ తో సంబరానికి కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ సంబరం రాత్రి 7 గంటల నుండి మొదలై మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల వరకు జరుగును అని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సంబరానికి ముఖ్య అతిథులుగా అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ లు పాల్గొని బసవేశ్వర స్వామి దర్శించుకుని స్వామి కరుణ కటాక్షం ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.అనంతరం గుడి పూజారులు భక్తులకు ప్రసాదా వితరణ కార్యక్రమం చేశారు.డీఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో టౌన్ సిఐ దారం సురేష్, ఎస్సై బి రాము లు పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మెడింటి సూర్య ప్రకాష్, చాపల వీరబాబు,తమ్మా బాల సుబ్రహ్మణ్యం ( ధర్మ కర్త),తమ్మా నాగార్జున రావు,తమ్మా వెంకటేశ్వర రావు,తమ్మా శివ శ్రీదొడ్డిపట్ల సూర్య ప్రకాశ్,దొడ్డిపట్ల సత్య బాలాజి,దొడ్డిపట్ల వీర వెంకట రాఘవేంద్రా (రాఘు),దొడ్డిపట్ల సాయి,సిద్దాని సత్యనారాయణ,రుద్రక్షుల మరిడియ్య,దొడ్డిపట్ల ధన గంగారాజు గుడిమెట్ల రవి,గుడిమెట్ల నాగు,నిల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo