రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్:
మండల కేంద్రమైన రాయవరంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చిన్నారులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో గ్రీన్ కలర్ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి, ప్రకృతి చిత్రాలు, మొక్కలతో తరగతి గదులను అలంకరించారు. పర్యావరణ పరిరక్షణపై పాటలు, పద్యాలు, నృత్యాలు, ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ డాక్టర్ శేషవేణి మల్లిడి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
