కాకినాడలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

కాకినాడ సిటీ, ఆగస్టు 14:, Kakinada (VISWAM VOICE DESK): స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కాకినాడ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా రిహార్సల్స్ నిర్వహించారు. అనంతరం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రిహార్సల్స్ జరిగాయి. అనంతరం ఎస్పీతో పాటు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది, ఎన్‌సీసీ క్యాడెట్లు, వివిధ కళాశాలలు, పాఠశాలలకు...