ద్రాక్షారామలో ఘనంగా స్టేట్ బ్యాంక్ నూతన బ్రాంచీ ప్రారంభోత్సవం
RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని చారిత్రక పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామలో ఇటీవల ఆధునిక హంగులతో నవీకరించిన భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) బ్రాంచీని అమరావతి సర్కిల్ నెట్‌వర్క్ 1 జనరల్ మేనేజరు ప్రపుల్ల కుమార్ జెనా బుధవారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన జనరల్ మేనేజరు ప్రపుల్ల కుమార్ జెనాకు బ్రాంచీ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. కొత్తగా రూపుదిద్దుకున్న ఈ బ్రాంచీని అందమైన పూలతో, ఆకర్షణీయంగా ముస్తాబు చేయడంతో...