06:34 AM, 3 Wednesday March 2021

ఘనంగా ఐక్య క్రిస్మస్ వేడుక

రంగంపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండలం లో పాస్టర్స్ ఫెలోషిప్ ఐక్య క్రిస్మస్ వేడుక రంగంపేట మండల పాస్టర్స్ కమిటీ  ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమమునకు  అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, తాళ్లరేవు మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి  వెంకటేశ్వరరావు,  స్థానిక వైసిపి నాయకులు  పేపకాయల రాంబాబు,  పాలాటి నాగేశ్వరరావు, తూము శీను, పోతుల వీరన్న,  కొల్లాటి ఇజ్రాయిల్, కుసుమంచి కృష్ణం రాజు,  పాల్గొన్నారు. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వరరావు క్రీస్తు పుట్టుక గురించి ఏసు క్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి అందించిన రక్షణ గురించి శుభములు తెలియజేశారు వచ్చిన  అతిథులకు రంగంపేట మండల పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ ప్రెసిడెంట్  అడపా విజయకుమార్  సెక్రెటరీ గారు బాబు  ట్రెజరర్  బి సి హెచ్ కోటేశ్వరరావు మరియు కమిటీ వారు ఘనంగా సన్మానించారు రంగంపేట మండలం లో ఉన్న దైవ సేవకులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై సేవకుల లో ఉన్న ఐక్యతను చాటారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#