VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 8:35 pm Posted by : Chandu

భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రాయవరం, East Godavari (VISWAM VOICE DESK):

రాయవరం పోలీసుల హెచ్చరిక

 

తుఫాను ప్రభావంతో రాయవరం మండలంలో బుధవారం రాత్రి కూడా భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాయవరం పోలీసులు సూచించారు. అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, శిథిలావస్థలో ఉన్న భవనాల సమీపంలో సంచరించకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే చెరువులు, కాలువలు వద్దకు ఎవరూ వెళ్లకూడదని హెచ్చరించారు. పోలీసుల సూచనలు పాటిస్తూ కుటుంబ సభ్యుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని రాయవరం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ డి. సురేష్ బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.