దాతల సహకారంతో ద్రాక్షారామ పాఠశాలలో ఇంటర్ ప్లస్ విద్యార్థులకు మెరుగైన వసతులు
Draksharama (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ద్రాక్షారామం నున్నవారి వీధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పేరిచర్ల శేఖర్ తెలిపారు. పాఠశాలలో ఇంటర్ ప్లస్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు పూర్తిస్థాయిలో ప్రయోగశాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని విద్యలో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఇక్కడ...