రాయవరం, East Godavari (VISWAM VOICE DESK):
రూ.1.93 కోట్లతో నూతన భవన నిర్మాణం.. శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేగుళ్ల
రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్:
రాయవరం మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గ్రామంలో నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి శనివారం శంఖుస్థాపన నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.93 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ నిర్మాణ పనులకు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ అనిరుధ్ తో కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.
గతంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో అదే ప్రాంతంలో నూతన భవన నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆధునిక వసతులతో ఆసుపత్రి భవనాన్ని నిర్మించి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రాయవరం పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆయన పేర్కొన్నారు. నూతన ఆసుపత్రి నిర్మాణంతో వైద్య సదుపాయాలు మరింత అందుబాటులోకి వస్తాయని పలువురు సంతోషం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉండవల్లి రాంబాబు, వల్లూరి శ్రీనివాస్, చల్లా సత్యనారాయణ, బర్ల రాజు, నేతల సురేష్, కందుకూరి గంగరాజు, ఇండుగుమిల్లి అరుణ్ కుమార్, జనసేన నాయకులు దేవిశెట్టి కోటేశ్వరరావు, బేరా దుర్గా ప్రసాద్, తూము చక్రధరరావు, పట్నాల జగదీష్, ఆసుపత్రి సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.