రాయవరంలో ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రికి శ్రీకారం
రాయవరం, East Godavari (VISWAM VOICE DESK): రూ.1.93 కోట్లతో నూతన భవన నిర్మాణం.. శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేగుళ్ల రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్: రాయవరం మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గ్రామంలో నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి శనివారం శంఖుస్థాపన నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.93 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ నిర్మాణ పనులకు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ అనిరుధ్ తో కలిసి...