ఏలూరు, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
ఏలూరులో అంతు చిక్కని వ్యాధితో ఆసుపత్రిపాలైన బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. రోగ లక్షణాలతో పాటు వ్యాధి ప్రబలడానికి సంబంధించిన వివరాలను వైద్యులనడిగి తెలుసుకున్నారు. వ్యాధికి గల కారణాలు నివారణ చర్యలపై కాసేపట్లో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు