కే. గంగవరం జడ్పీటీసీ అభ్యర్థిగా సిర్రా సురేష్‌కు అవకాశం కల్పించాలి
K. GANGAVARAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని సమయంలోనూ పార్టీ అభివృద్ధి, బలోపేతం కోసం నిరంతరం కృషి చేసిన నాయకుల్లో సిర్రా సురేష్ ఒకరని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ చేపట్టిన బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, కే. గంగవరం మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ మంత్రి వాసంశెట్టి సుభాష్...