గోదావరి పుష్కరాల నాటికి కాకినాడ వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్
పెద్దాపురం, కాకినాడ సిటీ, ఆగస్టు 14:, Kakinada (VISWAM VOICE DESK): గోదావరి పుష్కరాల నాటికి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఆనూరులో నిర్మాణంలో ఉన్న వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వ్యర్థాలను విద్యుత్‌గా మార్చే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నామని చెప్పారు. శుక్రవారం ఆనూరు గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్...