మండపేట శ్రీ వల్లూరి పనస రామన్న (ఎస్ వి పి ఆర్) మెమోరియల్ ఐ టి ఐ కాలేజ్ విద్యార్థులు ప్రతిష్టాత్మక ఎల్ అండ్ టి కంపెనీ లో ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల కరస్పాండెంట్ కొనే వీర్రాజు తెలిపారు.ఈ ఏడాది ఫైనల్ ఇయర్ విద్యార్థులు 31 మంది ఇంటర్వ్యూలో విజయం సాధించారని పేర్కొన్నారు. క్యాంపస్ లో జరిగిన ఎంపిక లో వీరు అర్హత సాధించారని పేర్కొన్నారు . వీరి కి ఆ సంస్థ నుండి ఎంపిక ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

