03:51 AM, 3 Wednesday March 2021

వాహనం ఢీకొని చిరుత మృతి

సీతాగొంది, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఆదిలాబాద్‌ జిల్లా సీతాగొంది అటవీ ప్రాంతంలో జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చిరుత మృత్యువాతపడింది. విషయం తెలుసుకున్న అటవీ, పోలీసు అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మూడేండ్ల వయస్సున్న మగ చిరుత రోడ్డు దాటే సమయంలో ప్రమాదం జరిగి ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు. చిరుత కళేబరాన్ని గుడిహత్నూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి మంగళవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించనున్నట్టు ఆదిలాబాద్‌ అటవీ శాఖ డివిజనల్‌ అధికారి చంద్రశేఖర్‌ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#