09:19 AM, 2 Tuesday March 2021

కోవిడ్ వ్యాప్తిని అరికడదాం

రాజానగరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

స్వీయ నియంత్రణతో కోవిడ్ 19 వ్యాప్తిని అరికడదామని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. విశ్వవిద్యాలయంలో బుధవారం ఎన్ఎస్ఎస్ విభాగం, కృష్ణ విశ్వవిద్యాలయం మరియు సంబంద్ హెల్త్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వెబినార్ నిర్వహించారు. ‘ఇంపాక్ట్ అఫ్ స్పిట్టింగ్ ఆన్ కోవిడ్ 19’ అనే అంశంపై జరిగిన ఈ వెబినార్ లో వీసీ ఉపన్యసించారు. కోవిడ్ 19ను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ప్రపంచంలోని ప్రజలందరూ సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో ఉమ్ము వేయడం మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయని చెప్పారు. వైరస్ లను వ్యాప్తి చేయడంలో మన  అజాగ్రత్త లే ప్రధాన మార్గాలు అవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో లో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా. బి కెజియారాణి, కృష్ణ విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య కె.బి.చంద్రశేఖర్, డాక్టర్ వి మురళి కృష్ణ, డా.జె. లావణ్య లతా, సంజయ్ సెత్ మరియు ఉభయగోదావరి జిల్లాల ప్రోగ్రామ్ అధికారులు పాల్గొన్నారు.
రైటప్: సమావేశంలో మాట్లాడుతున్న వీసీ

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#