16 November 2025
Sunday, November 16, 2025

మండలంలో పంటనష్టం పై ప్రాథమిక అంచనా

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

పడిపోయిన, నీటి మునిగిన 4562 హెక్టార్ల విస్తీర్ణం.

7570 మంది రైతులకు పంటనష్టం

మండల వ్యవసాయ అధికారి కెవిఎన్ రమేష్ కుమార్

 

విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం

మొథా తుఫాను తీవ్రత కారణంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల వ్యాప్తంగా పడిపోయిన, నీట మునిగిన వరి పంట పొలాలను రాయవరం మండల వ్యవసాయాధికారి కెవిఎన్ రమేష్ కుమార్ బుధవారం సందర్శించారు. మాచవరం, చెల్లూరు, వెంటూరు, కురకాళ్లపల్లి, కూర్మాపురం గ్రామాల్లోని పంట పొలాలను పరిశీలించిన ఆయన విలేకరులకు వరి పంట నష్టం ప్రాథమిక అంచనాను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 4562 హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం సంభవించిందని వాటిలో 1879 హెక్టార్ల విస్తీర్ణంలో పంట నీట మునగగా, 2683 హెక్టార్ల విస్తీర్ణంలో నేల కొరిగినట్లు పేర్కొంటూ, సుమారుగా 7570 మంది రైతులు నష్టపోయినట్లు ప్రాథమిక అంచనాను తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, రైతులు, గ్రామ వ్యవసాయ సహాయకులు , గ్రామ రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo