VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 6:19 pm Posted by : shaikabdulla9733@gmail.com

జనసేన స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా మహిపాల గణేష్

GOKAVARAM, East Godavari (VISWAM VOICE DESK):

గోకవరం: కాకినాడ పార్లమెంట్ పరిధిలోని జగ్గంపేట నియోజకవర్గ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ నిర్వాహక దళ సభ్యుడిగా గోకవరానికి చెందిన జనసేన కార్యకర్త మహిపాల వీర వెంకట సత్యనారాయణ (గణేష్) నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియామక పత్రం విడుదల చేశారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన పవన్ కళ్యాణ్‌కు, జగ్గంపేట ఇన్‌చార్జి తుమ్మలపల్లి రమేష్‌కు గణేష్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.