రాఖీతో మరింత బలపడిన అన్నాచెల్లెళ్ల అనుబంధం
GOKAVARAM, East Godavari (VISWAM VOICE DESK): గోకవరం: రాఖీ పండుగను పురస్కరించుకున అన్నాచెల్లెళ్ల అనుబంధం మరోసారి వెల్లివిరిసింది. చెల్లెళ్లు తమ అన్నలకు రాఖీలు కట్టి, జీవితాంతం తోడుగా ఉండాలని కోరుకుంటూ ఆప్యాయతను చాటుకున్నారు. అన్నలు కూడా తమ చెల్లెళ్లకు అండగా ఉంటామని హామీ ఇస్తూ కానుకలు అందించారు. ప్రేమ, ఆప్యాయత, ఆత్మీయతకు ప్రతీకగా రాఖీ పండుగను కుటుంబ సభ్యులు ఆనందంగా జరుపుకున్నారు.