VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 5:28 pm Posted by : shaikabdulla9733@gmail.com

ఘనంగా ఎల్ఐసీ 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

GOKAVARAM, East Godavari (VISWAM VOICE DESK):

గోకవరం ఎల్ఐసీ కార్యాలయంలో 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బ్రాంచ్ మేనేజర్ డి.ఎస్.వి. సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత నిగమ్‌ గీత్ ఆలపించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎల్ఐసీ అందిస్తున్న విశిష్ట సేవలను వక్తలు కొనియాడారు. ఎల్ఐసీ ప్రారంభమైన నాటి నుంచి అభివృద్ధి చెందుతూ దేశంలో అగ్రగామి జీవిత బీమా సంస్థగా కొనసాగుతోందని బ్రాంచ్ మేనేజర్ తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, ఏజెంట్లు పాల్గొన్నారు.