VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 2:20 pm Posted by : shaikabdulla9733@gmail.com

రాజమండ్రికి మరిన్ని సర్వీసులు పెంచాలి: కూటమి నాయకులు

GOKAVARAM, East Godavari (VISWAM VOICE DESK):

గోకవరం: రద్దు చేసిన విజయవాడ, విశాఖపట్నం, ద్రాక్షారామ బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని, రాజమండ్రికి మరిన్ని సర్వీసులు నడపాలని కోరుతూ కూటమి నాయకులు బుధవారం గోకవరం ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. జగ్గంపేట షటిల్ సర్వీస్‌ను పునరుద్ధరించాలని, విద్యార్థుల కళాశాల సమయాల్లో అదనపు బస్సులు నడపాలని కోరారు. డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.