మండల కార్యాలయాలా… మృత్యు ఉచ్చులా .!
విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు... అడవిని తలపిస్తున్న పొదలు... పాముల సంచారంతో ప్రాణభయంలో ఉద్యోగులు, ప్రజలు రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్: రాయవరం మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. ప్రజలకు భద్రత కల్పించాల్సిన కార్యాలయాలే ప్రస్తుతం ప్రమాదాలకు నిలయాలుగా మారినా సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీడీవో కార్యాలయం, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం, గ్రంథాలయం, హౌసింగ్, వెలుగు, ఉపాధి హామీ తదితర కార్యాలయాల పరిసరాల్లో నెలకొన్న...