Mandapeta (Mandapeta), East Godavari (VISWAM VOICE DESK):
మండపేట పురపాలక సంఘం నూతన చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన వేగుళ్ల అజయ్ కుమార్‌ను పురపాలక సంఘంలో ఔట్సోర్సింగ్ సిబ్బందిగా పనిచేస్తున్న ఉద్యోగులు ఘనంగా అభినందించారు.ఈ సందర్భంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నాయకులు అశోక్ కుమార్, పాలచర్ల లీలా కృష్ణ ఆధ్వర్యంలో అజయ్ కుమార్‌ను దుశ్శాలువాతో సత్కరించి, పూలమాలలు వేసి, జ్ఞాపికను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండపేట పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేలా వేగుళ్ల అజయ్ కుమార్ సమర్థవంతమైన పాలన అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టణ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఔట్సోర్సింగ్ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్లు సి.హెచ్. శ్రీనివాస్, పి. రవికిరణ్, పాలచర్ల లీలాకృష్ణ, వి. రాజేష్ కుమార్, జి. అశోక్ కుమార్, నల్లమిల్లి సతీష్ రెడ్డి, అటెండర్ మణికంఠ తదితరులు పాల్గొని నూతన చైర్మన్‌కు అభినందనలు తెలిపారు.