క్రీడలను ఎప్పుడు ప్రోత్సహించే మాధవి ఆయిల్స్ అధినేత వేగుళ్ళ కృష్ణ చైతన్య బాబు స్థానిక విజయలక్ష్మి నగర్ శివారు బైపాస్ రోడ్డు నందు యువతకు ఉపయోగకరమైన మాధవి స్పోర్ట్స్ బాక్సులను బుధవారం నాడు ప్రారంభించారు. ఇందులో రెండు క్రికెట్ కోర్టులు, ఒక శెట్టిల్ కోర్టు, ఒక వాలీబాల్ కోర్ట్ ,ఒక పింక్ బాల్ కోర్టును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత ఆరోగ్యం పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోజుకి ఒక గంటపాటైన ఆరోగ్యం పట్ల దృష్టి సారించి కసరత్తులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, వేగుళ్ల రేణుకాదేవి, వల్లూరి కుమార్ బాబు, వల్లూరి రామన్న చౌదరి, వల్లూరి మనోజ్ బాబు, వంక ప్రసాద్, వేగుళ్ల బాబీ, ముళ్ళపూడి రాయుడు,యినవిల్లి రాజేష్, యాదగిని ప్రసాద్,వట్టికుట్టి రమేష్,మాధవి ఆయిల్ కంపెనీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

