మంత్రి సుభాష్ సామాజిక న్యాయం పాటించాలి.. కే. గంగవరం జడ్పీటీసీ స్థానం మాదిగలకు కేటాయించాలి: టీడీపీ సీనియర్ నేత దొరబాబు

K. GANGAVARAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తూ కే. గంగవరం మండల జడ్పీటీసీ అభ్యర్థి ఎంపికలో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని టీడీపీ సీనియర్ నేత దొరబాబు కోరారు. కూటమి ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని, ముఖ్యంగా పార్టీ విజయానికి కృషి చేసిన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. డాక్టర్...