ముద్రగడ పద్మనాభంకు అస్వస్థత.. క్షేమంగా ఉన్నారన్న కుటుంబ సభ్యులు
హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స.. నిలకడగా ఆరోగ్య పరిస్థితి * వెంటిలేటర్‌పై ఉన్నారనేవి అవాస్తవాలు.. పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి హైదరాబాద్ (విశ్వం వాయిస్ న్యూస్ బ్యూరో): మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందుతోంది. గత రెండు రోజులుగా ఆయనకు డయాలసిస్ ప్రక్రియ...