మండపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
మండపేట పట్టణ రాడ్ బైండింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గా షేక్ మస్తాన్ ఎన్నికయ్యారు. మండపేట మండల ఏడిద లోని సంగమేస్వరాలయంలో వనసమారాదన కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతనకార్యవర్గ ఎన్నికలు జరిగాయి. సభ్యులు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అద్యక్షులుగా షేక్ మస్తాన్, కార్యదర్సిగా ఆకాశపు రంగా, కోశాదికారిగా పొన్నాడ దుర్గారావు, ఉపాద్యక్షులుగా అలబండ శ్రీను లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా కార్యదర్సి కె కృష్ణ వేణి, ,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లాఉపాద్యక్షులు షేక్ ఇబ్రహీం, గోమాడశ్రీను,తాపీమెస్త్రిల అద్యక్షులుఈశ్వర్రావు,వడ్రంగిసంఘంసెక్రటరి కొటిపల్లికృష్ట,పూడి రాయనరావు, పులిబంటిసత్తిబాబు, కొర్లపాటిశ్రీనుతదితరులు పాల్గొన్నారు.ముఖ్య అతిదిగా విచ్చేసిన మండపేట నియోజకవర్గ వైకాపా ఇంచార్జ్ తోటత్రీమూర్తులు నూతనకార్యవర్గాన్ని అబినందించారు.