నిర్లక్ష్యంలో అరుంధతిపేట.. ఎనిమిది నెలలుగా మెయిన్ రోడ్ లైట్లు బంద్

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలం, వేగాయమ్మపేట గ్రామంలోని అరుంధతిపేటలో గత ఎనిమిది నెలలుగా మెయిన్ రోడ్డుపై లైట్లు పనిచేయకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ప్రధాన రహదారి చీకటిమయంగా మారడంతో ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. చీకటి కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు పరిష్కారం లభించలేదని...