రామచంద్రపురం మండలం ద్రాక్షరామ ఆగవారి వీధి లో అజాఖన్ ఏ జెహర పంజా వద్ద ఈ నేల 17 తారీకు న సాయంత్రం 5 గంటలకు హజరత్ ఇమామ్ హుస్సేన్ అలైహి సల్లం వారి దహుమ్ కార్యక్రమంను మండపేట వాస్తవ్యులు కీర్తిశేషులు గులాం అబ్బాస్ మనవడు వారిస్ హుస్సేన్ నిర్వహిస్తున్నట్లు టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సల్మాన్ హుస్సేన్ మండపేట లో స్థానిక మీడియా కు తెలిపారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు ఎం.ఏ అహమ్మద్ షరీఫ్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మెన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వేగుళ్ళ లీలా కృష్ణ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రమణ్యం, టిడిపి జిల్లా అద్యక్షులు రెడ్డి అనంత లక్ష్మి, టిడిపి నాయకులు గంధం పల్లం రాజు,రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు,టీడీపీ రామచంద్రపురం నియోజకవర్గం పరిశీలకులు గన్ని కృష్ణ,ప్రముఖ పారిశ్రామికవేత్త వంటిపల్లి పాపారావు,టీడీపీ గన్నవరం నియోజకవర్గం పరిశీలకులు షేక్ సుభాన్ మండపేట మునిసిపల్ మాజీ ఛైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు వల్లూరి సాయి కుమార్ బాబు,వైసిపి రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ (రాజబాబు),ప్రముఖ వైద్యులు డాక్టర్ జమాల్ ఖాన్ రాష్ట్ర శెట్టిబలిజ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గుడాల జయబాబు,రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి చంద్రశేఖర్ (దొరబాబు),రాష్ట్ర తూర్పుకాపు బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గడి సత్యవతిలు పాల్గొంటారని తెలిపారు.

