రామచంద్రపురం మండలంలో తొలి రోజు 7 ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంలో ఎంపీటీసీ ఎన్నికలు–2026కు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ అక్టోబర్ 21న ప్రారంభమైంది. రామచంద్రపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో మొత్తం 20 ఎంపీటీసీ స్థానాలకు గాను తొలి రోజు 7 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. దాఖలైన నామినేషన్లలో బీజేపీ నుంచి ఒకటి, జనసేన పార్టీ నుంచి ఒకటి, టీడీపీ నుంచి రెండు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి...