కరపలో ‘వన్ మంత్–వన్ విలేజ్–ఫోర్ విజిట్స్’ కార్యక్రమం
కరప, ఆగస్టు 14:, Kakinada (VISWAM VOICE DESK): ప్రజా సమస్యలను అత్యంత పకడ్బందీగా పరిష్కరించడమే లక్ష్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ‘వన్ మంత్–వన్ విలేజ్–ఫోర్ విజిట్స్’ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ శుక్రవారం కరప మండలంలో పర్యటించారు. కరప చంద్రన్న సమావేశ మందిరంలో వరుసగా రెండో వారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి నేరుగా అర్జీలు, దరఖాస్తులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా, వాటిని పరిశీలించి నిబంధనల మేరకు త్వరితగతిన...