11:02 PM, 3 Wednesday March 2021

అర్హులందరికీ సొంత ఇల్లు…….

అమలాపురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

రాష్ట్రం లో ప్రతీ నిరుపేదకు సొంత ఇల్లు ఉండాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఈ నెల 25 వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 26 లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అమలాపురం పట్టణ, గ్రామీణ నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయింపు ప్రక్రియను మంత్రి లాటరీ విధానం ద్వారా ప్రారంభించడం జరిగింది. ఆదివారం అమలాపురం లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో అమలాపురం పట్టణ, గ్రామీణ నిరుపేదలు మొత్తం 4648 మంది లబ్ధిదారులకు మంత్రి లాటరీ ద్వారా ఇండ్ల స్థలాలను కేటాయించడం జరిగింది. ఇందులో పట్టణ నిరుపేదలు(లబ్ధిదారులు) 2454 మంది కాగా గ్రామీణ నిరుపేదలు(లబ్ధిదారులు)2194 మంది. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి పారదర్శకమైన పాలన ప్రజలకు అందిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రతీ నిరుపేదకు సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యం తో ముఖ్య మంత్రి పనిచేస్తున్నారని,రాష్ట్రంలో ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ నెల 25 తేదీన రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది నిరుపేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని మంత్రి అన్నారు.అదే రోజు అల్లవరం మండలం బోడసకుర్రు లో అమలాపురం పట్టణ నిరుపేదలు కొరకు నిర్మించిన 1632 టిడ్ కో భవనాలను లబ్ధిదారులకు అప్పగిస్తూ భవనాలకు సంభందించిన రిజిస్ట్రేషన్ ధృవీకరణ పత్రాలను లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం మునిసిపల్ కమీషనర్ విఐపి నాయుడు, మండల తహసీల్దార్ ఠాగూర్, మండల అభివృద్ధి అధికారి ప్రభాకరరావు,డిప్యూటీ తహసీల్దార్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#