10:38 PM, 3 Wednesday March 2021

పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

అంబాజీపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

అంబాజీపేట పి.హెచ్.సి  లో 26 మంది గర్భిణీ స్త్రీ లకు కోవిడ్ పరీక్షలు  చేయగా  అందరికి నెగిటీవ్ వచ్చినవి .  గర్భిణీలు అందరికి సుదాబతుల రాము సమకూర్చిన డ్రై ఫ్రూట్స్,  ఫ్రూట్స్    పౌష్టికాహారాన్ని పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు  చేతులమీదుగా అందించరు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు కచ్చితంగా పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. కోవిడ్ -19 కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల వైకాపా ప్రధాన కార్యదర్శి నాగపూర్ నాగరాజు , ఏం సి డైరెక్టర్  మైల  ఆనందరావు,  దొమ్మేటి శ్రీనివాసరావు,  కోట సత్తిబాబు,  వైఎస్ఆర్ సీపీ నాయకులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#