రామచంద్రపురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
ది.రామచంద్రపురం బాప్టిస్ట్ ఫీల్డ్ కౌన్సిల్ క్రిస్టమస్ ఆరాధన కార్యక్రమాన్ని గోల్డెన్ జూబ్లీ టౌన్ బాప్టిస్ట్ చర్చి రామచంద్రపురం నందు నిర్వహించారు.పియుఅర్ మూర్తి అధ్యక్షతలో స్థానిక సంఘ కాపరి వి.జోసెఫ్ దీపక్ రాజ్ కుమార్ ప్రార్థనతో ఆరాధన ప్రారంబించారు.ముఖ్య అదితిగా పిలువబడిన బాప్టిస్ట్ తియోలాజికల్ సెమినార్ చైర్మన్ రెవ్.కె.జాన్ ఇమ్మానూయేల్ మాట్లాడుతూ క్రిస్టమస్ దినాలలో ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించి క్రిస్టమస్ ఆరాధనలు జరుపుకోవాలన్నారు. ప్రార్థన, సహవాసం, సౌవార్తికరన అనేవి ది.రామచంద్రపురం బాప్టిస్ట్ ఫీల్డ్ కౌన్సిల్ మోటో అని తెలియజేశారు. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు ఆచరించడం ద్వారా మన జీవితాలకు గొప్ప ఆశీర్వాదకరమని రెవ.బి.థీయోఫీలస్ ప్రసంగించారు .ఈ సందర్భంగా ది.అర్బిపీసి సెక్రటరీ రెవ. జి.అబ్రహం, ట్రజరర్ అర్.వర్మ, వైస్ ప్రెసిడెంట్ రెవ.సిఎచ్.సంజీవి,రికార్డింగ్ సెక్రటరీ కె.యేసుదాస్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ ప్రేమవిందులో ఇరవై రెండు సంఘాల పాస్టర్స్, పెద్దలు, విశ్వాసులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు