ద్రాక్షారామం ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఎండోమెంట్ విలీన నోటీసులపై పిల్లి సుభాష్ చంద్రబోస్ నిలదీత

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): రామచంద్రపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం వెలుపల ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయాన్ని దేవాదాయ (ఎండోమెంట్) శాఖకు అప్పగించాలంటూ నోటీసులు జారీ చేయడంపై మాజీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైయస్సార్‌సీపీ రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశాల మేరకే ఎండోమెంట్ శాఖ అడిషనల్ సూపరింటెండెంట్ ఈ నోటీసులు...